13 June, 2026 | 2:33 AM

మల్యాల పీఏసీఎస్‌ను పునః ప్రారంభించాలి

13-06-2026 01:36 AM

మహబూబాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): మల్యాల గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం సొసైటీ ని తక్షణమే పునః ప్రారంభించాలని సిపిఐ మహబూబాబాద్ మండల కార్యదర్శి తండా సందీప్, మండల సహాయ కార్యదర్శి బానోత్ లింగ్యనాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాల గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం సొసైటీ ని పునః ప్రారంభించి అక్కడి రైతులను ఆడుకోవాలన్నారు.

కొంత మంది దళారుల చేతిలో రైతులు మోసపోయారని, రైతులను కాపాడుకోవలిసిన బాధ్యత సహకార శాఖ అధికారులపై ఎంతైనా ఉందన్నారు. మల్యాల గ్రామంలో సహకార సంఘం తీసివేయడంతో అక్కడ వేలాది మంది రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే రైతులకు న్యాయం జరిగేలా చూసి సొసైటీ ని పునః ప్రారంభించాలన్నారు. ఈ మేరకు డిసిఓ విజయ కుమారికి వినతి పత్రం అందజేశారు.