5 May, 2026 | 2:01 AM

కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలి

05-05-2026 12:00 AM

మహబూబాబాద్, మే 4 (విజయక్రాంతి): కొనుగోళ్లు పూర్తిచేసిన వెంటనే ధాన్యం, మక్కలను వెంటనే గోదాములకు తరలించాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. సోమవారం కురవి మండలంలో విస్తృతంగా పర్యటించారు.  కురవి మండల కేంద్రంలో నూతనం గా ఏర్పాటు చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచీనీ ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఆదివారం వర్షానికి జరిగిన నష్టాన్ని, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని, అన్ని రకాల ఆదుకుం టామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లాలో ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే నిబంధన ప్రకారం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, రవాణా చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు, టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్స్, అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకోవాలని, రానున్న రోజుల్లో వర్షాలు పడే సూచన ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ మండలం చిలుక్కోడ రైతు వేదికలో ఏర్పాటుచేసిన రైతు వారోత్సవాలలో కలెక్టర్ పాల్గొన్నారు.

హనుమకొండ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మే 5, 6,7 మూడు రోజులు మెగా రైతు నేల నిర్వహించడం జరుగుతుందని, అందులో 150 స్టాల్స్ ను ఏర్పాటు చేసి రైతుల సౌకర్యార్థం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుందని, ఆ మూడు రోజులు జిల్లా నుండి ప్రతిరోజు ఉదయం 6 నుండి 7 మధ్యలో 13 బస్సుల ద్వారా రైతులను తరలించడం జరుగుతుందని, జిల్లాలోని రైతులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచిం చారు. రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.

రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, వాడకం, పామ్ ఆయిల్, డ్రోన్ టెక్నాలజీ, తదితర స్టాల్స్ ను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారిని సరిత, శాస్త్రవేత్తలు ప్రశాంత్, సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తహసిల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు, సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.