కోర్టు కానిస్టేబుల్‌కు రివార్డ్
05-05-2026 12:00 AM
సీపీ చేతుల మీదుగా అందుకున్న పోలీస్
వరంగల్, మే 4 (విజయక్రాంతి): వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వంద కిలోల గంజాయి అక్రమ రవాణా పాల్పడుతతూ పోలీసులకు పట్టుబడిన ఐదుగురు నిందితులకు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడటంలో ప్రతిభ కనబరిచిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాంపెల్లి ఉమేష్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందిస్తూ నగదు రివార్డును అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి శాఖపరమైన గుర్తింపు లభిస్తుందని సీపీ తెలిపారు.






