పెసా గ్రామసభలు సక్సెస్ డీ ఆమోదం
మంగపేట, మే 4 (విజయక్రాంతి ) : ములుగు జిల్లా మంగపేట మండలంలోని వాడగూడెం, రమణక్కపేట, అకినేపల్లి మల్లారం గ్రామాల పరిధిలో గోదావరి నదిలో డీ సిల్టేషన్ ( పూడిక తీత ) కోసం సోమవారం నిర్వహించిన పెసా గ్రామ సభలు సక్సెస్ అయ్యాయి. రమణక్కపేట గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 106 మంది గిరిజన ఓటర్లు ఉండగా రమణక్కపేటలోని ఎస్టీ కాలనీలో సోమవారం ఉదయం నిర్వహించిన పెసా గ్రామ సభకు 94 మంది హాజరు కాగా 79 మంది డీ సిల్టేషన్ ( పూడిక తీత ) కోసం అంగీకారం తెలిపారు.
వాడగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 207 మంది గిరిజన ఓటర్లు ఉండగా పాలాయిగూడెం ఎస్టీ కాలనీలో సోమవారం ఉదయం నిర్వహించిన పెసా గ్రామ సభకు 111 మంది హాజరు కాగా హాజరయిన 111 మంది డీ సిల్టేషన్ ( పూడిక తీత ) కోసం అంగీకారం తెలిపారు. అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 210 మంది గిరిజన ఓటర్లు ఉండగా అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీలో నిర్వహించిన పెసా గ్రామ సభకు 176 మంది హాజరు కాగా హాజరయిన 176 మంది డీ సిల్టేషన్ ( పూడిక తీత ) కోసం అంగీకారం తెలిపారు.
ఆయా గ్రామాలలో జరిగిన పెసా గ్రామసభల సందర్భంగా ఎలాంటి గొడవలు, ఆందోళనలు జరగకుండా ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, మంగపేట యస్‌ఐ టీ.వీ.ఆర్. సూరి, రెండవ యస్‌ఐ లంకదాసరి శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు. ఈ గ్రామ సభలలో ఏటూరునాగారం ఐటీడీఏ పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, మంగపేట తహశీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ భద్రు నాయక్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఏసుపాదం, పంచాయతీ కార్యదర్శులు సాధు మురళి, ఎట్టి రాంబాబు, రంజిత్, ఆయా గ్రామ ప్రత్యేక అధికారులు తెల్లం విజయలక్ష్మి, భావన, ఆయా గ్రామాల పెసా కమిటి మోబలేజర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






