18 April, 2026 | 4:19 AM

మూడవ విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

15-12-2025 12:23 AM

జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి

 నాగర్ కర్నూల్ డిసెంబర్ 14 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించ నున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం పాల్గొన్నారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి టీ-పోల్ పోర్టల్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు పరిశీలకురాలు తెలిపారు. జిల్లాలోని 7 మండలాల్లో మూడవ విడతలో జరగనున్న 151 గ్రామపంచాయతీలు, 1,412 వార్డులకు సంబంధించిన ఎన్నికల విధులు నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), ఓటింగ్ అధికారులు ఓపిఓలుకు ఈ ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు వివరించారు.

ఎన్నికల సంఘం నియమావళిని పాటిస్తూ ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 3,629 మంది సిబ్బందిని పీఓలు, ఓపిఓలు కలిపి ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ విధులకు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, నోడల్ అధికారి సీతారాం నాయక్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.