23-02-2025 12:00:00 AM
ప్రపంచంలో ఎన్నో అరుదైన పక్షులున్నాయి. కాని ఈ ఫొటోలో కనిపించే పక్షి చాలా ప్రత్యేకం. సగం ఆడ, -సగం మగ లక్షణాలున్న అరుదైన పక్షి ఇది. దీన్ని న్యూజిలాండ్ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ గుర్తించారు. కొలంబియాలో ఈ అరుదైన పక్షి కనిపించింది.
అయితే ఈ పక్షి సగం ఆకుపచ్చ, సగం నీలం రంగులతో ఉంది. ఇలాంటివి గత వందేళ్లలో రెండోసారి కనిపించిన అత్యంత అరుదైన పక్షిగా పరిశోధకులు గుర్తించారు. అయితే, ఈ పక్షికి ఆడ, మగ రెండు పునరుత్పత్తి అంగాలు ఉంటాయి. జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణం. పక్షుల్లో వీటిని ట్రాన్స్‌జెండర్లుగా కూడా పిలుస్తారు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది మాత్రం నిజం.