1 May, 2026 | 2:06 AM

జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

01-05-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అన్నారు. గురువారం జిల్లా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నూతన కలెక్టర్ ను కలిసి సన్మానం చేశారు.  ఉద్యోగులతో నిర్మల్ జిల్లా ఇది కథలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెల్మల ప్రభాకర్ కార్యదర్శి కూడాల రవికుమార్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వెంకట్రమణ  బి నవీన్ కుమార్ జాయింట్ సెక్రెటరీ కె ఆనంద్ పబ్లిసిటీ సిగరెట్ ఎం గంగాధర్ రూరల్ యూనిట్ కార్యదర్శి అజయ్ కుమార్  ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కోశాధికారి టి శ్రీకాంత్ ఫారెస్ట్ ఫోరం అధ్యక్షు లు నరేష్ ఇనాయత్ ఎం పరమేశ్వర్ యోగేష్ వెంకట్ రమణ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ప్రభుత్వ ఆశ్రమ గిరిజన పాఠశాలలో చదివి పదో తరగతిలో 550 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను విద్యార్థులను కలెక్టర్ భవేష్ మిశ్రా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటిడబ్ల్యుఓ జాదవ్ అంబాజీనాయక్ ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా తసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, గురువారం పట్టణంలోని, అర్బన్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రతీ రిజిస్టరు, రికార్డును పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ, కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసిల్దార్ రాజు, కార్యాలయ అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతి 

నిర్మల్ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్  భవిష్ మిశ్రాకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల స్థలాలకు సంబంధించిన ఫైల్ కలెక్టర్ ఆఫీసులో పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పాత్రికేయులు ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.