21 June, 2026 | 1:39 AM

న్యూరో అనస్థీషియా వైద్యుల పాత్ర కీలకం

21-06-2026 12:00 AM

నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్

పంజాగుట్ట,జూన్20(విజయక్రాంతి):న్యూరో సర్జరీలను విజయవంతంగా నిర్వహించడంలో న్యూరో అనస్థీషియా వైద్యుల పాత్ర అత్యంత కీలకమైనదని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ అ నస్థీషియ విభాగం ఆధ్వర్యంలో నిమ్స్ న్యూ రో అనెస్కాన్ 2026 పేరిట శిక్షణ సదస్సును శనివారం ప్రారంభించారు. నేడు కూడా కొనసాగనున్న ఈ సదస్సును సంస్థ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూరో అ నస్థీషియా వైద్యులు మెదడు నిర్మాణం, నా డీ వ్యవస్థ పనితీరుపై సమగ్ర అవగాహన కలిగి ఉంటారన్నారు. తద్వారా రోగులకు మ రింత సురక్షితమైన వైద్య సేవలను అందించగలమని పేర్కొన్నారు.

నిమ్స్ అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో న్యూరో అనాటమీ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ది న్యూ అనస్థీటేటిస్ట్ అంశంపై జరుగుతున్న సదస్సు సంబంధిత విభాగ వైద్యులు, పీజీ విద్యార్థులకు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఎం తో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చే శారు.అనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీలత మొనింగి మాట్లాడుతూ మొదటి రో జు సదస్సులో భాగంగా మెదడు నిర్మాణం, సుప్రాటెంటోరియల్ మరియు ఇన్ఫ్రాటెంటోరియల్ భాగాలు, మెదడుకు రక్త సరఫరా వ్యవస్థ,న్యూరోఅనాటమీకి సంబంధించిన అంశాలపై నిపుణులు ఉపన్యాసాలు ఇచ్చారన్నారు.

నేడు జరిగే సదస్సుల్లో  న్యూరో స ర్జికల్ కేసులపై కేస్ బేస్డ్ డిస్కషన్స్, ఇంట్రాక్రానియల్ అన్యూరిజమ్ తదితర అంశాలపై నిపుణుల చర్చలు, అనంతరం క్విజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో డీన్ డాక్టర్ పి.చంద్రశేఖర్, అనస్థీషియాలజీ విభాగ వైద్యులు సప్నా, నిఖార్, పద్మజ దుర్గ, శాస్త్రీయ కమిటీ సభ్యులు డా క్టర్ అబినాష్ పాత్రో, డాక్టర్ రామనాథ్, డా క్టర్ కె.శివప్రియ, డాక్టర్ ప్రాచి శర్మ,  రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నుంచి అనస్థీషియాలజిస్టులు, పీజీ విద్యార్థులు,వైద్య నిపుణులు పాల్గొన్నారు.