రాష్ట్రాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం
- మంత్రి శ్రీధర్‌బాబు
- మేడే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
మంథని,మే 1 (విజయక్రాంతి): రాష్ట్రాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పట్టణాలను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రి పాల్గొని కార్మికులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజ పురోగతికి కృషి చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
మంథని పట్టణంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఇల్లు లేని వారికి గుర్తింపు ఇచ్చి, వారికి ఇందిరమ్మ ఇళ్లను అందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని ఆయన కార్మికులకు హామీ ఇచ్చారు. మంథని మున్సిపల్ పరిధిలో పాలకవర్గం కృషి చేస్తున్న అభివృద్ధికి మున్సిపల్ కార్మికుల సేవ అత్యంత ముఖ్యమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కార్మిక సంఘం నాయ కుడు బూడిద గణేష్, కౌన్సిలర్లు పెంటరి రాజు, మారుపాక నిహారిక, ఎల్లేంకి వంశీ, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
సమ్మర్ క్యాంప్‌ను సందర్శించిన మంత్రి
అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో టి ఫైబర్ నెట్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న సూపర్ సమ్మర్ క్యాంప్‌ను మంత్రి సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న టీ సూపర్ సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతతోపాటు కొత్త కొత్త కళల్లో నైపుణ్యత పెంపొందుతుందన్నారు. గొప్ప ఇంజనీర్లుగా అలాగే కంప్యూ టర్ యుగంలో రోబోటిక్స్,ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా మూన్ ల్యాండింగ్ యంత్రా న్ని మూడు రోజుల్లో రూపొందించడం హ ర్షించదగ్గ విషయమన్నారు. జిల్లాలో 350 మంది విద్యార్థులు ఈ క్యాంపులకు వస్తున్నారని, విద్యార్థులకు సహకరిస్తున్న తల్లిదం డ్రులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రమంతా విద్యార్థులకు ఈ రకమైన శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు.
మంథని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మంథని పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంథని పట్టణంలో మంత్రి విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా గోదావరి నదిని సందర్శించిన మంత్రి, నదిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి, భవన నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించారు.
అలాగే నిర్మాణంలో ఉన్న ఎంఆర్‌వోఆర్డీవో, సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను పరిశీలించి, పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.మంథనిలోని అయ్యగారి చెరువును సందర్శించిన మంత్రి, బండ్ సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రహదారి క్లియర్ చేసే చర్యలు తీసుకో వాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్డీవో సురేష్, ఎమ్మార్వో ఆరిఫ్ ఉద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.






