ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
- కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలి
- సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలి
- ఆర్టీసీ జేఏసీ నాయకుల డిమాండ్
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జేఏసీ సమావేశమైం ది.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బీ యాదగిరి మాట్లాడారు. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ముందుగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గతం లో సీఎం తమను ముందు విలీనం కావాలా? ఎన్నికలు కావాలా? అని కోరితే తామంతా ముందు విలీనమే కావాలని స్పష్టం చేశా మని గుర్తు చేశారు. ఈ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలని కోరారు.






