21-02-2026 12:00:00 AM
సిద్దిపేట, ఫిబ్రవరి 20: సిద్దిపేటలోని శ్రీవెంకటేశ్వర ధ్యాన మందిరంలో శుక్రవారం ఇస్కాన్ ప్రభుజీ నరసంహాదాస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పోటీలు జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 6వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, మండల విద్యాశాఖ అధికారి రాజ ప్రభాకర్ రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేష్, టీపీఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కాచం శ్రీనివాస్, లోహిత్ సాయి హాస్పిటల్ వైద్యుడు ఎ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
మెరీడియన్ స్కూల్, సెలెస్టియల్ స్కూల్, క్రాంతి హైస్కూల్ కు చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. సిద్దిపేట ఇస్కాన్ నిర్వాహకులు రంగ తీర్థ ప్రభుజీ, చిప్పా పవన్ సాయి, వేముల వేణు, మనోహర్ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీత ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు వివరించారు.