17 April, 2026 | 11:58 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి

09-06-2025 12:00 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ 

మందమర్రి, జూన్ 8 : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండ లంలోని అన్ని గ్రామ పంచాయతీలలో కాషాయ జెండాను ఎగురవేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కోరారు మండలంలోని చిర్రకుంట గ్రామంలో ఆదివారం నిర్వహించిన మం డల బీజేపీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమానికి నిర్వి రామంగా కృషి చేస్తుందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బిజెపి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యా మ్నాయం బీజేపీ అని బీజేపీని బలోపేతం చేసి రానున్న స్థానిక ఎన్నికలలో అన్ని గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అంతకు ముం దు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మొక్కలు నాటారు. మండల బిజెపి అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు, దీక్షితులు, మండల ప్రధాన కార్యదర్శులు వంజరి వెంకటేష్ రాజేష్ నాయక్, కర్రె రాజయ్య, వివిధ గ్రామాల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.