31-12-2025 01:46:18 AM
మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులు వినియోగించే నైలాన్ సింథటిక్ మాంజాల విక్రయాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని డివైఎఫ్‌ఐ మేడ్చల్ మండల జిల్లా అధ్యక్షులు మన్నె ప్రశాంత్ మేడ్చల్ సిఐ సత్యనారాయణకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి మేడ్చల్ సర్కిల్ పరిధిలో నైలాన్ సింథటిక్ మాన్జాల విక్రయాలు కొనుగోలు కొనసాగుతున్నాయని దీనివలన ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు, చిన్నారులకు పక్షులు జంతువులకు తీవ్ర ప్రమాదాలు ప్రాణ నష్టం జరుగుతున్న విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో నైలాన్ సింథటిక్ మాన్జాల విక్రయాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన పోలీసులను కోరారు.
అక్రమంగా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని డిమాండ్ లతో డివైఎఫ్‌ఐ మేడ్చల్ మండల కమిటీ తరఫున మేడ్చల్ సిఐ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేసినట్లు మన్నె ప్రశాంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కే నర్సింగరావు, మండల కార్యదర్శి బాల కిరణ్ అధ్యక్షులు రంజిత్ నాయకులు శ్రీకాంత్, అఖిల్, విట్టల్ పాల్గొన్నారు.