31-12-2025 01:47:10 AM
స్వాగతం పలికిన గుడి చైర్మన్, పార్టీ నాయకులు
చిట్యాల, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిట్యాల లోని కనకదుర్గ అమ్మవారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని హైదరాబాద్ నుండి నకిరేకల్ కు వెళ్తున్న ఎమ్మెల్యేకు ముందుగా గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ స్వాగతం పలికి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, నాయకులు పోకల దేవదాసు, జడల చిన్న మల్లయ్య, వనమా వెంకటేశ్వర్లు, కాటం వెంకటేశం, పాటి మాధవరెడ్డి, ఎద్దులపురి కృష్ణ, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, కుక్కల మోహన్, బొబ్బల రామ్ రెడ్డి, జిట్టా చంద్రకాంత్, రెమడాల లింగస్వామి, జగిని భిక్షం రెడ్డి, రెముడాల మధు, దేశపాక రాజేష్, ఇబ్రహీం, చెరుకుపల్లి శ్రీశైలం, చోల్లేటి శ్రీకాంత్, పోషబోయిన నరసింహ, కోమటిరెడ్డి అమరేందర్ రెడ్డి, పాల చినస్వామి, కోనేటి ఎల్లయ్య, సిల్వర్ శేఖర్, ఏనుగు అంజిరెడ్డి, రావుల విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.