ఒకే బస్సు.. బాదుడు వేరు!
కామారెడ్డి నుంచి జేబీఎస్‌కు రూ. 250.. అదే రోజు జేబీఎస్ నుంచి కామారెడ్డికి రూ. 340
ప్రయాణికులను దోపిడీచేస్తున్న ఆర్టీసీ!
కామారెడ్డి, మార్చి 18 (విజయక్రాంతి): పండుగ వచ్చిందంటే ఆర్టీసీ అధికారులు ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారు. ఒకే రోజు ఒకే డిపో బస్సులో ప్రయాణం చేసిన ఇద్దరికి రెండు రకాల రేట్లతో టికెట్లు జారీ చేసి విస్తూ పోయేలా చేశారు. కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన నాన్ స్టాప్ డీలక్స్ బస్సు లో బుధవారం ఇద్దరు ప్రయాణికులు కామారెడ్డి నుంచి జేబీఎస్‌కు వెళ్లారు.
ఒక్కరికి రూ. 250 చొప్పున ఇద్దరికి రూ.500 వసూలు చేశారు. తిరుగు ప్రయాణంలో జేబీఎస్ నుంచి కామారెడ్డికి మళ్లీ నాన్ స్టాప్ డీలక్స్ బస్సు ఎక్క గా ఒక్కరికి రూ.340 చొప్పున రూ.680 టికెట్ డబ్బులు వసూలు చేశారు. ఇదేమిటని ప్రయాణికులు అడిగితే తమకేం తెలియదని, పండుగ ఉండటంవల్లే బస్ చార్జీలు పెంచారని బస్సు డ్రైవర్ జవాబు ఇచ్చారు.
ఒకే బస్సులో ఉద యం ఒక రేటు, సాయంత్రం మరో రేటు ఏమిటని ప్రశ్నించగా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పు కోండి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము టికెట్ తీసుకుంటున్నామని బస్సు డ్రైవ ర్, కండక్టర్ చెప్పారు. ప్రయాణికులను ఆర్టీసీ నిలువు దోపిడీ చేస్తున్నదని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ పూట దూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి రావడానికి ప్రయాణికులకు అధిక భారం వేసి టికెట్లు ఇవ్వ డం సరికాదని ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.




