21 April, 2026 | 4:42 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

అప్పుడు పొగిడినవాళ్లే..ఇప్పుడు విమర్శిస్తున్నారు!

18-12-2024 12:00 AM

అమరజ్యోతి,  తెలంగాణ తల్లి రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి

నేను అన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేశా. తెలంగాణ ఉద్యమంలోను ఉన్నా.. ఉద్యమ సమయంలో జేఏసీ కోసం పూర్తిస్థాయిలో పనిచేశా. అంతేకాదు ఏబీవీపీ కూడా నా డిజైన్లు వాడుకుంది. నేను కేవలం ఒక పార్టీకి పనిచేయలేదు. నేను ఉద్యమం కోసం పనిచేశా. ఉద్యమానికి పిడికిలిలా చూపించిన ఆకృతిని  అన్ని పార్టీలు, అన్ని అభిమాతాలకు అనుగుణంగా డిజైన్ చేశాను.  

ఏ పార్టీతో సంబంధం లేదు

కొత్త తెలంగాణ తల్లికి మేం ఇచ్చిన ఆకృతి వాస్తవానికి దగ్గరగా ఉంది. విస్తృతమైన ప్రజాదరణ పొందుతున్నది. ఒక సామాన్యుడు సొంతం చేసుకునే విధంగా ఉంది. ఇప్పుడు కొందరి సెంటిమెంట్ బతుకమ్మ. ‘మామూలు తల్లి డిజైన్ అయినా పర్వాలేదు. బతుక మ్మ ఉంటే చాలు’.. అన్నట్టు వారి కామెంట్లు ఉన్నాయి. మాకేం రాజకీయాలు అవసరం. మేం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ నలకు తోడు ఉన్న వాస్తవికతకు ప్రజలకు ఏ రకంగా చేరువగా తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ డిజైన్ చేశాం.

కాబట్టి వాళ్లకు చెప్పుకోవడానికి ఏం లేదు.  కాబట్టి ఆర్టిస్టు మీదనే రాయి వేస్తే సరి పోతుందని అనుకున్నారు. మాకు పార్టీలతో ఏం సంబంధం లేదు. ప్రభుత్వంతోనే సంబంధం ఉంది.  తెలంగాణ ఉద్యమమంతా నేను నా సొంత డబ్బులతోటి నా పెట్రోల్ పోసుకుని నా కారులో నేను తిరిగి.. ఉద్యమానికి పని చేశా. వాళ్లు కనీసం స్పీచ్‌లకో, పాటలు పాడటానికో ఉన్నారు. అంతేందుకు దేశపతి నా కండ్ల ముంగటే ఎన్నోసార్లు డబ్బులు తీసుకున్నాడు. నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే.. అడగలే. నా సొంత డబ్బులతో మన ఆర్టి స్టులను పిలిచి.. వాళ్లతో ఆర్ట్ క్యాంపులు నిర్వహించాను. వాళ్లకు చర్చించడానికి ఏం లేదు కాబట్టి వ్యక్తిగత దూషణకు దిగారు. 

పూర్తిగా రాజకీయం.. 

డిజైన్‌పై నాకు విస్తృతమైన పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. వ్యతిరేకంగా కామెంట్లన్నీ రాజకీయ పరమైన కామెంట్లు తప్పితే.. కళకు సంబంధించినా కామెంట్లు కాదు. అది వ్యక్తిగతంగా కావా లని చేసే కామెంట్ తప్పితే.. వాస్తవికతతో చేసినవి కాదు. డిజైన్ ఎలా ఉండాలనేది ఆర్టిస్టు నిర్ణయించాలి కానీ.. నాకు అధికారం ఉంది నేనే నిర్ణయిస్తా అంటే సరిపోదు. నువ్వు ఆలోచన చెప్పు.. దాన్ని ఆర్టిస్టు అమలు చేస్తాడు. ‘అది సక్సెస్ అయితే నాది.. ఫెయిల్ అయితే నాది కాదు’ అని అంటారు నాయ కులు. సీఎం రేవంత్‌రెడ్డి ఎమన్నారంటే.. ‘మనది ప్రజల ప్రభు త్వం.. ప్రజలు సాధించుకున్న తెలంగాణ’ కాబట్టి.. ఒక సామాన్య స్త్రీలాగే ఉండన్విండని చెప్పారు. మేం అలాగే డిజైన్ చేశాం. 

అమరజ్యోతిపైనా దుమారమే

అసలు విషయం ఏంటంటే.. గతంలో నాటి సీఎం కేసీఆర్ అప్రూవ్ చేసింది వేరే డిజైన్. అది స్టార్ షేప్‌లో ఉండేది.. అప్పుడు అన్నీ పేపర్లు ఫ్రంట్ పేజీల్లో వేశాయి. అంటే అమరులను ధృవతా రలని భావిస్తాం..  కాబట్టి అలా డిజైన్ చేశా. దానికి అప్పుడు ఎని మిది కోట్లు మంజూరయ్యాయి. తర్వాత డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కూడా అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలి యదు. మళ్లీ కేసీఆర్ పిలిచినప్పుడు మరో డిజైన్ చూపించా.. అది అమరజ్యోతి.

చనిపోయిన వారికి ఎవరికైనా మనం దీపం వెలిగిం చి నివాళి అర్పిస్తాం కాబట్టి అలా డిజైన్ చేశా. డిజైన్ చేసేముందే మనకు స్పష్టత ఉండాలి. ఏదో ఒకటి ఊహించుకుని చేస్తే ఫెయిల్ అవుతాం. అలా కాకుండా టెక్నికల్‌గా, ఆర్కిటెక్చరల్‌గా ఆలోచించి చేశాం. నాకు 80 దేశాలు తిరిగినా అనుభవం ఉంది. కొన్ని వందల డిజైన్స్ చూశాను కాబట్టి, అన్ని విధాలుగా ఆలోచించి.. ఆ డిజైన్ రూపొందించా. ఇది కూడా చాలా బాగుందని కేసీఆర్ అన్నారు.

అప్పుడు కేటీఆర్ సూచనతో స్టార్ డిజైన్ కాస్త దీనికి మారింది. డిజైన్‌కు తగ్గట్టుగా బడ్జెట్ కూడా  మారింది. బడ్జెట్ పెరగడంతో ప్రతిపక్షానికి ప్లస్ పాయింట్ అయింది. ఆ వివాదం ఉంది తప్ప. డిజైన్ పరంగా ఎలాం టి వివాదం లేదు.