మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్
- మంత్రి ఉత్తమ్ కుమార్.. ఆనాటి నుంచే కేసీఆర్ కోవర్టు
- ఉత్తమ్ పేరుకే కాంగ్రెస్... నిజానికి బీఆర్ఎస్ కార్యకర్త
- 72 ఏళ్ల వయసులో కేసీఆర్ పచ్చి అబద్దాలు
హైదరాబాద్: 72 ఏళ్ల వయసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Arvind Dharmapuri) ఆరోపించారు. కేసీఆర్ చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని ధర్మపురి అర్వింద్ వివరించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ భారీగా బకాయిలు పెట్టిపోయారని అర్వింద్ తెలిపారు. కేసీఆర్ పాలనలో సివిల్ సప్లయ్ లో అక్రమాలు మొదలయ్యాయని ఆరోపించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్(Minister Uttam Kumar Reddy) ఆనాటి నుంచి కేసీఆర్ కోవర్టు అని ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ పేరుకే కాంగ్రెస్.. నిజానికి బీఆర్ఎస్ కార్యకర్త అని అర్వింద్ స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన బిల్లులో కరెంట్ మీటర్ అనేది లేనేలేదన్నారు. రైతుల వద్ద కరెంట్ బిల్లు వసూలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని వివరించారు. ఆదివాసీలకు పోడు పట్టాలు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, పోడు పట్టాలు అడిగిన మహిళలపై దౌర్జన్యాలు చేయించారని సూచించారు. తెలంగాణ రైతులను పట్టించుకోలేదు.. పంజాబ్ లో చెక్కులు ఇచ్చి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






