calender_icon.png 9 February, 2026 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ అభివృద్ధికి సంకల్ప్ ఫౌండేషన్ ముందుకు

08-02-2026 12:00:00 AM

కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి కమిషన్ సభ్యురాలు సరిత, తుంగతుర్తి రవి 

మేడిపల్లి, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 10వ డివిజన్ పీర్జాదిగూడ హైస్కూల్ను తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, ఎన్జీవో సంకల్ప్ ఫౌండేషన్ చైర్మన్ రోజీ సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, బాలల హక్కులు, విద్యా ప్రాముఖ్యత, వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ లక్ష్యాల సాధన వంటి అంశాలపై అవగాహన కల్పించారు.  కవా డి శ్రీవిద్య మోహన్, వంగూరి పరమేష్, మహ్మద్ మజర్, నాగరాజు, ఎంఈఓ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివా స్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రావు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.