పేదలకు సన్నబియ్యం కార్యక్రమం చారిత్రత్మక నిర్ణయం
ఎమ్మెల్యే పద్మావతి..
చిలుకూరు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. చిలుకూరు మండలం జెర్రీపోతుల గూడెం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఆమె మాట్లాడుతూ... గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసి పోయారని అన్నారు.
అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోతుందని అన్నారు. చిలుకూరు నుండి జెర్రిపోతుల గూడెం వరకు 24 కోట్ల, రూపాయలతో డబుల్ రోడ్లు నిర్మించడం జరిగిందని గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిర్మించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీత వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి హనుమంతురావు, పిఎసిఎస్ చైర్మన్ బజ్జూరి రవీందర్ రెడ్డి, ఒట్టికూటి నాగయ్య, బజ్జూరు వెంకటరెడ్డి, నల్లబోతు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






