ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత
- పలు రోగాలతో ఆటలాడుతున్న ప్రజలు
పట్టించుకోని పాలకులు, అధికారులు
పెబ్బేరు, మార్చి 2 :పెబ్బేరు పట్టణ కేం ద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు అం దుబాటులో ఉండాల్సిన ప్రాథమిక వైద్య సే వలు అందించడంలో డాక్టర్లు లేక తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటోంది. ఆసుపత్రిలో కనీసం ఇద్దరు డాక్టర్లు గాను ఒకరు మెడికల్ ఆఫీసర్, మరొకరు రెగ్యులర్ డాక్టర్ ఉండా ల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్కరు కూడా విధుల్లో లేరు. దీంతో ప్రతిరోజూ వైద్యం కోసం వచ్చే వందలాది మంది పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ డాక్టర్లు లేక ప్రవేట్ ఆసుపత్రి వైపు పేద ప్రజలు
ప్రతిరోజూ సగటున 100 నుండి 150 మంది వరకు ఓపి (ఔట్ పేషెంట్లు) వస్తుండటం పరిస్థితి ఎంత అత్యవసరంగా ఉందో చూపిస్తోంది. ఎక్కువగా బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్న వారు, కుక్క కాటు కే సులు, చిన్నపాటి ప్రమాదాలు, గాయాలకు డ్రెస్సింగ్ చేయించుకోవాల్సిన వారు, సాధారణ జ్వరాలు మరియు ఇతర అనారోగ్యా లతో బాధపడుతున్నవారు ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కానీ డాక్టర్లు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ అధిక ఖర్చులతో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రజల ఆరోగ్య హక్కు కేవలం పేపర్లలోనే....?
ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు ఒక నమ్మకం. కానీ ప్రస్తుతం ఆ నమ్మకం దెబ్బతింటోంది. పై అధికారులకు పలుమార్లు డాక్టర్ల నియామకంపై ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ప్రజల ఆరోగ్య హక్కు కేవలం పేపర్లలోనే మిగిలిపోతోందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఒక్కడే అందరి బాధ్యతలు....!
ప్రస్తుతం పల్లె దవాఖాన డాక్టర్ చంద్రశేఖర్ గత సంవత్సరం నుంచి అదనపు బా ధ్యతగా ఈ ఆసుపత్రికి వచ్చి సేవలు అందిస్తున్నారు. ఆయన ఒక్కడే అందరి బాధ్యత లు భుజాన వేసుకుని పని చేయాల్సి వ స్తోంది. ఇది ఎంతకాలం సాధ్యం? ఒకే డాక్ట్ప ఇంత భారీ భారం మోపడం ఎంతవరకు సమంజసం? ప్రజల ప్రాణాలతో ఆటలాడే ఈ నిర్లక్ష్యాన్ని అధికారులు వెంటనే గుర్తించాలి.
తక్షణమే మెడికల్ ఆఫీసర్ మరియు రెగ్యులర్ డాక్టర్ నియామకం చేపట్టి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




