15-12-2025 12:52:37 AM
మహబూబాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త సంఘటనలు మినహా పంచాయతీ పోరు ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మ హబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలో రెండో దశ 564 గ్రామాల సర్పంచులు, 4,937 వార్డు మెంబర్ల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 56 గ్రామాల సర్పంచు పదవులు, 917 వార్డు స భ్యుల పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.
మిగిలిన 508 సర్పంచ్, 4,020 వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇ క్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ ట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సరళిని ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పంచాయతీ అధికా రులు పర్యవేక్షించారు.
ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వెబ్ కాస్టింగ్, ప్రత్యక్షంగా ఎన్నికల తీరును వీక్షించారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించి సర్పంచ్, వార్డు సభ్యుల విజేతలను ప్రకటించారు.మహమ్మద్ గౌస్ పల్లి వార్డు మెంబర్ ఎన్నికలకు జరిగిన పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని బ్యాలెట్ పత్రాలపై ఇంకు మరకలు కనిపించడంతో నిరసన వ్యక్తం చేయడంతో వాటిని తర్వాత లెక్కిస్తామని సర్ది చెప్పి ఓట్ల లెక్కింపు చేపట్టారు.
నర్మెట్ట మండలం మరియాపురంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువు వర్గాలను చదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహింప చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆముదల పల్లి గ్రామ సర్పంచ్ గా చింతల విష్ణు తన ప్రత్యర్థి మనోహర్ పై కేవలం మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
జిల్లాలో పోలింగ్ నమోదు శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 85.25% పోలింగ్ నమోదు కాగా, భూపాలపల్లి మండలంలో 83.24, టేకుమట్లలో 88.72, చిట్యాలలో 84.55, పలిమెల లో 86.38, మహబూబాబాద్ జిల్లా లో మొ త్తంగా 82.24 శాతం నమోదు కాగా తొర్రూ ర్ మండలంలో 83.34 బయ్యారంలో 69.67 చిన్న గూడూరులో 86.75 దంతాలపల్లి లో 88.15 గార్ల లో 82.06 నర సింహుల పేటలో 87.81 పెద్ద వంగరలో 85.88 శాతం పోలింగ్ నమోదయింది.
ఇక ములుగు జిల్లాలో 82.93 శాతం పోలింగ్ నమోదు కాగా, జనగామ జిల్లాలో 82.69 శాతం పోలింగ్ నమోదు కాగా బచ్చన్నపేట మండలంలో 70. 03, జనగామలో 88.53, నర్మెట్టలో 87.28, తరిగొప్పులలో 85.38 శాతం పోలింగ్ నమోదయింది. ఇక హనుమకొండ జిల్లాలో 87.25 శాతం పోలింగ్ నమోదు కాగా, అయినవోలు మండలంలో 87.25, ధర్మసాగర్ మండలంలో 85.85, వేలేరులో 86.97, హసన్ పర్తిలో 87.90, పరకాల లో 86.90 శాతం పోలింగ్ నమోదయింది.
ఇక వరంగల్ జిల్లాలోని దు గ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 88.11 శాతం పోలింగ్ నమోదయ్యింది. మొత్తంగా 1,36,191 ఓట్లకు గాను 1,20, 001 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులు ఎస్టీలకు కేటాయించగా, గ్రామంలో ఎస్టి ఓటర్లు లేకపోవడంతో సర్పంచు పదవితో పాటు మూడు వార్డులకు పోటీ లేకుండా పోయింది.
దీనితో కేవలం 5 వార్డుల స భ్యుల ఎన్నిక మాత్రమే నిర్వహించారు. మిగిలిన మూడు వార్డులకు ఎన్నికలు నిర్వ హించకపోవడంతో ఆయా వార్డుల్లో ఉన్న ఓటర్లు ఓటు హక్కు కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఇదే జిల్లా నల్లబెల్లి పంచాయతీ నాలుగో వార్డులో తల్లి కూతురు పోటీ పడగా తల్లి సరోజనపై కుమార్తె సౌజన్య 120 మెజార్టీతో గెలుపొందారు.
88.52 శాతం పోలింగ్ నమోదు
జనగామ, నవంబర్ 14 (విజయక్రాంతి): జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతం గా ముగిసిందని *జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.bఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్ లో 88.52శాతం న మోదు అయ్యిందన్నారు.ముందుగా కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి ని పరిశీలించారు.
అనంతరం పెంబర్తి, శామీర్ పేట్, తమ్మడ్ పల్లి లో పో లింగ్ కేంద్రాలను జనరల్ అబ్సర్వర్ రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రి జ్వాన్ బాషా షేక్ సందర్శించి... అక్కడ జరుగుతున్న పోలింగ్ నిర్వహణ ను నిశితం గా పరిశీలించారు. పోలీస్ బందో బస్తు, పోలిం గ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను, పోలింగ్ అధికారుల పని తీరు ను అబ్సర్వర్, కలెక్టర్ దగ్గరుండి పరిశీలించి... ఆర్వో లకు, మైక్రో అబ్సర్వర్ లకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ
హనుమకొండ, డిసెంబర్ 14 (విజయ క్రాంతి):హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో గ్రామపంచాయతీలకు రెండో విడతలో సర్పంచ్, వార్డు స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగి శాయని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. జి ల్లాలో రెండో విడతలో ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలా ల్లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉద యం ఏడు గంటలకు ప్రారంభమైందని పేర్కొన్నారు.
ఎన్నికల నియమ నిబంధనలు మేరకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.జిల్లాలోని ఐదు మండలాల్లో ఉదయం 7 నుండి మధ్యా హ్నం ఒంటిగంట వరకు ధర్మసాగర్ మండలంలో 85.85 పోలింగ్ శాతం నమోదు కాగా హసన్పర్తి మండలంలో 87.90 శాతం, ఐనవోలు మండలంలో 88.61 శాతం , వేలేరు మండలంలో 86.97 శాతం, పరకాల మండలంలో 86.90 పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించారు.
ధర్మసాగర్ మండలాని కి సంబంధించి 37346 మొత్తం ఓట్లకు గాను 32062 ఓట్లు పోల్ కాగా హసన్ పర్తి మండలంలో మొత్తం ఓటర్లు 23049 కాగా 20260 ఓట్లు పోల్ అయ్యాయి. ఐనవోలు మండలంలో మొత్తం ఓటర్లు 34489 కాగా 30560 ఓట్లు పోల్ కాగా, వేలేరు మండలంలో మొత్తం ఓటర్లు 15749 కాగా 13 697 ఓట్లు పోల్ అయ్యాయి. పరకాల మండలంలో మొత్తం ఓటర్లు 15102కాగా 13124 పోల్ అయ్యాయి. మధ్యాహ్నం నుండి రెండు గంటల నుండి వార్డులు, సర్పంచుల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా వార్డులు, సర్పంచుల ఫలితాలను ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఎన్నికల అధికారులు ప్రకటించారు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
రేగొండ/భూపాలపల్లి,డిసెంబర్ 14(విజయక్రాంతి): జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ 2వ విడత సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, పలిమెల, టేకుమట్ల మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఆయన పేర్కొన్నా రు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటలకు 26.40 శాతం,11 గం టలకు 62.37 శాతం, మధ్యాహ్నం 1 గంటకు వరకు 84.14 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.
పోలింగ్ ముగిసే సమ యానికి మొత్తం 82,728 మంది ఓటర్లకు గాను 70,526 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, మొత్తంగా 85.25 శాతం పోలింగ్ నమోదు జరిగినట్లు ఆయన వెల్లడించారు.మండలాల వారీగా నమోదైన పోలింగ్ శాతం. భూపాలపల్లి 83.24 శాతం,చిట్యాల 84.55 శాతం,పలిమెల 86.38 శాతం, టేకుమట్ల 88.72 శాతం, పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.
ములుగు
ములుగు, డిసెంబర్14(విజయక్రాంతి)2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్ని కల నేపథ్యంలో జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జి ల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
రెండవ విడతలో వెంకటాపూర్, ములుగు , మల్లంపల్లి, మండలా లలోని 37 సర్పంచు స్థానాలకు, 315 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రెండవ విడత ఎన్నికల ప్రక్రియలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని తెలిపా రు.గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండవ విడత మల్లంపల్లి , ములుగు , వెంకటాపూర్ మూడు మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించగా
ఎన్నికల పోలింగ్ 82.93 శాతం నమోదు అయింది.
మూడు మండలాల్లో కలిపి మొత్తం 54,944 ఓట్లు ఉండగా, 45,565 పోల్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 82.93 శాతం పోలింగ్ నమోదు అయింది. మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయి న పోలింగ్ శాతం మల్లంపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 10,883 మంది ఉండగా, 9,265 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మల్లంపల్లి మండల వ్యాప్తం గా 85.13 శాతం నమోదు అయింది. ములుగు మండలంలో మొత్తం ఓటర్లు 20,470 మంది ఉండగా, 16,479 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా 80.50 శాతం నమోదు అయింది.వెంకటాపూర్ మండలంలోమొ త్తం ఓటర్లు 23,591 మంది ఉండగా, 19, 821 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా 84.02 శాతం నమోదు అయింది.