24-06-2025 07:13:18 PM
పెన్ పహాడ్: ఏ విత్తనమైనా ఎదగడానికి విత్తన కవచం ఏర్పాటు చేసుకోవడం ప్రధానమని ఉత్తమ ఉపాధ్యాయులు మామిడి వెంకటయ్య అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండల పరిధిలోని యుపిఎస్ దోసపాడు పాఠశాల యందు విద్యార్థులకు సీడ్ బాల్స్ మొక్కల పెరుగుదల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మనం ఎండాకాలంలో సేకరించిన విత్తనాలను సీడ్ బాల్సగా అంటే సేంద్రియ పదార్థాలతో వాటిని కప్పి ఒక గుండ్రంగా మనం ఉండలాగా మార్చి అవసరమైన ప్రాంతాలలో చల్లినట్లయితే వర్షాలు రాగానే విత్తనానికి కప్పి ఉన్న ఉండ ఎదుగుతున్న మొక్కకు సేంద్రియ ఎరువుగా మొక్క తీసుకుంటుందన్నారు. అలాగే ఎవరు ఒక్కొక్క మొక్కను నాటుతూ పెంచాల్సిన అవసరం లేదన్నారు. ఇది అధిక వర్షపాతాన్ని గాని అధిక ఎండను కానీ అధిక నీడను కానీ తట్టుకొని మొక్కగా ఎదుగుతుందన్నారు. మొక్కల పెంపకం-వాటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు.