calender_icon.png 13 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్వ్యూకు 43 మంది ఎంపిక అభినందనీయం

13-11-2025 01:12:36 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాం ధీ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా లబ్ధిపొందిన 43 మంది మెయిన్స్‌కు ఎంపిక కావడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 342 మంది తెలంగాణ యువత 3.62 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని సింగరేణి సంస్థ ద్వారా పొందారని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన 43 మంది విద్యార్థులకు మరో లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్ తెలిపారు. ఆర్థిక సాయంతో పాటు ఢిల్లీలో వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.