17 April, 2026 | 6:29 PM

మన ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు

16-05-2025 01:31 AM

- బీజేపీ ఎంపీ డీకే అరుణ ధ్వజం

హైదరాబా ద్, మే 15 (విజయక్రాంతి): తెలంగాణ ఆడపడచులతో విదేశీ సుందరీమణుల కాళ్లు కడిగించడం అత్యంత బాధాకరమని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆడబిడ్డలతో కాళ్లు కడిగించడమంటే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని గురువా రం ఆమె ప్రకటనలో విమర్శించారు.

విదేశీ యువతలు పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం సరికాద న్నారు. మన సాంప్రదాయాలను గౌరవించాలని, కానీ అవమానించడం సరికాదన్నారు. ఈ విష యంపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే వివరణ ఇవ్వాలని అరుణ డిమాం డ్ చేశారు.