05-07-2025 12:00:00 AM
మహిళా సమాఖ్యకు నిరంతరం ఆదాయం
చేకూరేందుకు గ్యాస్ ఏజెన్సీ మంజూరు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఘా
రాజన్న సిరిసిల్ల:జూలై 4(విజయక్రాంతి)ఇల్లంతకుంట మండలము ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు భేష్ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఈ మండల సమాఖ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆత్మ నిర్బర్ సంఘాతన్ అవార్డుకు ఎంపిక కాగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య బ్యాంకు రుణాల అందజేత, రికవరీ, క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పై జిల్లా కలెక్టర్ అభినందించారు.
నిరంతర ఆదా యానికి గ్యాస్ ఏజెన్సీ మంజూరుఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్యకు నిరంతరం ఆదాయం వచ్చేలా గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేయాలనిడీఆర్డీఓ శేషాద్రిని కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీతో మండల సమాఖ్య ఆర్థికంగా మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మండల సమాఖ్య బాధ్యులు ఎస్ హెచ్ జీ సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తాంము.