calender_icon.png 5 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

04-07-2025 11:54:11 PM

వాజేడు,(విజయక్రాంతి): విద్యార్థినిలు అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనతో ఉండాలని వాజేడు ప్రాథమిక వైద్యశాల వైద్యులు కొమరం మహేందర్ అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారి డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలో గల ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 199 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. వీరికి డాక్టర్ మహేందర్ సీజనల్ వ్యాధుల పట్ల, వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రతలో పాటించదగిన నియమాలను వివరించారు.

విద్యార్థినులందరికీ ఔట్ పేషెంట్ సేవలను అందించారు. వీరిలో 59 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో బాధపడే బాలికలకు ఆర్డిటి మలేరియా డెంగ్యూ రక్త పరీక్షలు నిర్వహించారు. హాస్టల్లో సిక్ రూమ్ పరిశీలించి ప్రాథమికంగా ఇవ్వవలసిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని హెల్త్ కేర్ టేకర్ కు తెలియజేశారు. అనంతరం వంటశాల పరిసరాలను పరిశీలించి పౌష్టికమైన ఆహారమును పిల్లలకు తెలియజేశారు.