18 March, 2026 | 4:49 AM

ఆరు గ్యారెంటీలు దొంగ హామీలే

18-03-2026 12:00 AM
  1. ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేయాలి 
  2. గజ్వేల్ ఐఓసీ వద్ద నిరసన వ్యక్తం చేసిన బిజెపి నాయకులు 

గజ్వేల్, మార్చి17: ఆరు గ్యారెంటీల పే రుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిందని, ఇప్పటివరకు 6 గ్యారంటీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మో సం చేస్తుందని బిజెపి నాయకులు ఆరోపించారు. గజ్వేల్ పట్టణ, మండల బిజెపి ఆధ్వ ర్యంలో గజ్వేల్ ఇంచార్జ్ ఎమ్మార్వో భాస్కర్ కు ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమ లు చేయాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ లు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, మహిళలకు ప్రతినెల రూ.2500, విద్యార్థులకు రూ.5 లక్షల విద్య భరోసా పథకాలు ఏవీ అమలు చేయలేదన్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.4వేల పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, రైతు భరోసా, వంటి హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందన్నారు.

రైతులు, విద్యార్థులు, మహిళల ఆక్రోశానికి అద్దం పడుతుందని, ము ఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య వితంతు, దివ్యాం గులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి పేదలకు గృ హ నిర్మాణ పథకం భూ సమస్యల పరిష్కా రం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలను నయవంచన చేసిందని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వి ధానాలపై బిజెపి పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలి ఉన్న 999 రోజులూ వారి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందన్నా రు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నా యకులు యెల్లు రాంరెడ్డి, కుడిక్యాల రాము లు, బిజెపి కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, దాతర్ పల్లి సర్పంచ్ బాసు రాజు, ఉప సర్పంచ్ బారు అరవింద్, మన్నె శేఖర్, చె ప్యాల వెంకట్ రెడ్డి, నాయిని సందీప్ కుమా ర్, మన్నెం శశిధర్ రెడ్డి, నాగు ముదిరాజ్, తలారి రాజు, పేర్ల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సల్ల శ్రీనివాస్, శ్రీరామ్ కృష్ణ, కాశమైన సం దీప్ కుమార్, జోడు ప్రకాశ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.