26 June, 2026 | 2:01 AM

గగన వీధిలో త్రివర్ణ శోభ

26-06-2026 12:39 AM

విజ్ఞాన్స్ క్యాంపస్‌లో వంద అడుగుల జాతీయ జెండావిష్కరణ 

భూదాన్ పోచంపల్లి, జూన్ 25(విజయక్రాంతి): విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భా వాల స్ఫూర్తిని రగిలించేలా యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ క్యాం పస్ ఆవరణలో 100 అడుగుల ఎత్తున భార త జాతీయ జెండాను ఆవిష్కరించారు. పచ్చ ని ప్రకృతి మధ్య, ఆకాశమే హద్దుగా గంభీరంగా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం క్యాంపస్‌కే ఒక సరికొత్త చారిత్రాత్మక శోభను తీసుకువచ్చింది.

20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ భారీ జాతీయ జెండా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసినట్లు విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మా లకొండయ్య తెలిపారు. స్వాతంత్య్రం, దేశ సమైక్యత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుం టూ, వారి స్ఫూర్తితో నవభారత నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సంకల్పంతో ఈ జాతీయ పతాకాన్ని ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, దేశసేవ భావాన్ని పెంపొందించడం తమ లక్ష్యమన్నా రు.

ఈ జాతీయ జెండా ప్రతి విద్యార్థికి దేశం పట్ల బాధ్యతను, కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ, స్ఫూ ర్తినిచ్చే కేంద్రంగా నిలుస్తుందన్నారు. గగనతలంలో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం విజ్ఞాన్స్ క్యాంపస్‌కు మరింత గౌరవాన్ని, ప్రత్యేకతను తీసుకొచ్చిందని విశ్వవిద్యాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు అభిప్రాయపడ్డారు. క్యాంపస్‌లో ఇంతటి ప్రతిష్టాత్మకమైన భారీ జాతీయ పతాకం రెపరెపలా డటంతో ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.