కార్తె మారినా కరువు తీరలే
- వానలు లేక రైతన్న కన్నీళ్లు!
- మొలకెత్తకుండానే మాడిపోతున్న విత్తనాలు
అల్లాదుర్గం, జూన్ 25: మృగశిర కార్తె వచ్చిందంటే మబ్బులు ముసురుకొని సన్న ని జల్లులు పడాలి.. ఏరువాక సాగాలి. కానీ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో నిప్పు ల వాన కురుస్తోంది. విత్తనాలు మొలకెత్తకుండానే మాడిపోతున్నాయి. మృగశిర కార్తె ప్రవేశించి 14 రోజులు గడుస్తున్నా చినుకు జాడ లేదు. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించినా, అల్లాదుర్గం మండలంలో మా త్రం ఇంకా వర్షపు చుక్క కోసం నోరు తెరుచుకొని ఎదురుచూస్తోంది. దీంతో జూన్ రెం డో వారం నుంచి 43 డిగ్రీల భానుడి భగభగలకు, వేడి గాలులకు పొలాల్లో విత్తిన పత్తి, కంది మినుము, పెసర విత్తనాలు మొలకెత్తకుండానే మాడిపోతున్నాయి.
పత్తి, సొ యా, కంది, మినుము, పెసర పంటలను సాగు చేసిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మృగశిరలో జల్లు పడితే జొన్న పైరు బలంగా వస్తుంది. కానీ ఈసారి రోహిణి కార్తె ఎండలు మృగశిరలోనూ కొనసాగుతున్నాయి. పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి. అల్లాదుర్గం మండలంలో తొలకరి వర్షాలను నమ్ముకుని వేలాది ఎకరాల్లో రైతులు పత్తి, మక్కజొన్న, వరి నార్లు పోసేందుకు సిద్ధమయ్యారు. కానీ, వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు నాటే ప్రక్రియ నిలిచిపోయింది. భూగర్భ జలమ ట్టం పాతాళానికి పడిపోయింది. గతంలో నీరు పోసిన బోరుబావులు సైతం ఇప్పుడు గాలిని కక్కుతున్నాయి. ఇప్పటికే అప్పులు తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి న రైతులు... వాతావరణం అనుకూలించక మానసిక వేదన అనుభవిస్తున్నారు.






