18 June, 2026 | 3:37 AM

గీతం వర్సిటీలో నాలుగేండ్ల బీఈడీ కోర్సు

18-06-2026 02:22 AM

28న గాట్-2026 ప్రవేశ పరీక్ష  

వెల్లడించిన అదనపు వీసీ డీఎస్ రావు

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : కొత్తగా రెండు నాలుగేండ్ల బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టినట్లు గీతం డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు పేర్కొన్నారు. పటాన్‌చెరు-- రుద్రారంలోని తమ వర్సిటీలో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కోర్సుల నిర్వహణకు కొత్తగా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను వర్సిటీలో స్థాపించామని తెలిపారు. బుధవారం బేగంపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బోవర్ స్కూల్ ఆఫ్ అంత్రప్రెన్యూర్‌షిప్ సహకారంతో బీబీఏ (అంత్రప్రెన్యూరిషిప్), బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కోర్సులను సైతం ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టామన్నారు. గీతం అడ్మిషన్ టెస్ట్ (గాట్)-2026 పరీక్షను ఈ నెల 28న జాతీయస్థాయిలో ఆన్‌లైన పద్దతిలో నిర్వహించనున్నా మన్నా రు.

ఈ నెల 26లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ట్యూషన్ ఫీజు, హాస్టల్, వందశాతం స్కాలర్‌షిప్స్ పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో వర్సిటీ ప్రతినిధిలు రీచాశర్మ, రమేష్ వడ్డీ, డాక్టర్ శామ్యూ ల్, మమత, రెజా తదితరులు పాల్గొన్నారు.