4 May, 2026 | 3:40 AM

సుకన్య సమృద్ధి యోజన అద్భుతమైన పథకం

04-05-2026 02:36 AM

తాడ్వాయి, మే, 3( విజయ క్రాంతి): సుకన్య సమృద్ధి యోజన పథకం అద్భుతమైనదని తాడ్వాయి తహసీల్దార్ శ్వేత తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో అర్హురాలు అయిన ముదాం భవిజ్ఞ కు పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను ప్రారంభించారు. ఈ డబ్బులను గ్రామానికి చెందిన రెడ్డి గారి తిరుపతిరెడ్డి సమకూర్చడం జరిగింది.

భవిజ్ఞ తాత అయిన మదాం మల్లయ్యను ఈ సందర్భంగా తహాసిల్దార్ సన్మానించారు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి అర్హులైన అందరికీ సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం అవసరమైన డబ్బులను తానే స్వయంగా సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ నర్సారెడ్డి,అడ్వకేట్ రెడ్డి గారి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.