5 September, 2026 | 8:08 AM

తెగని దారి పంచాయతీ

26-08-2026 | 12:13pm

ఉరివేసుకొని రైతు ఆత్మ హత్య 

మహబూబాబాద్ (విజయక్రాంతి): వ్యవసాయ భూమికి దారి పంచాయతీ ఏర్పడడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరెడలో జరిగింది. దిగువ భాగంలో వ్యవసాయ భూమి ఉన్న మొగిలిచర్ల రామచంద్రయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలోకి వెళ్లడానికి మొదట్లో భూమి ఉన్న జక్కుల వీరన్న అనే రైతుతో వివాదం తలెత్తింది. దిగువనున్న భూమిలోకి రామచంద్రయ్య వెళ్లకుండా వీరన్న దారికి అడ్డుగా కనీలు పాతడంతో మనస్థాపానికి గురై సంఘటన స్థలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు