3 August, 2026 | 1:19 AM

ఎగసిన జెన్ జీ తరంగం

03-08-2026 12:37 AM

తప్పును తప్పని నినదించే ముక్త కంఠ స్వరాలు

విద్వేషం దరిచేరని నవ నవ యువ తరంగాలు

కల్మషం కైపెక్కని తేటతెల్లని హృదయ లయలు

రాజ్యపు అకౌంటబులిటీ కోసమే రాజ్యాంగ రణం

పసితనం లోనే మనస్సులు మలుపుకునే కాలం

స్వతంత్రను కోల్పోక స్వచ్ఛత తోసే కౌమారం

కపటాత్వాన్ని ఎండగట్టి ఎదురు తిరిగే ధీరత్వం

వందేమాతరం కొనసాగింపు జన్ జీ తరంగం

గ్లోబలీకరణలో మునిగి తేలుతున్న కాలాన

రెండు మూడు దృశ్యాలే భవిష్య దర్శనాలు

ఇరవై ఏడేళ్ల పిల్ల రియా అహిర్ ఒక సాహసి

నిరసనకారులను నింపుకున్న పోలీసు వాహనం

అరెస్టు వారెంట్స్ ఉన్నాయా! అని గట్టిగ ప్రశ్నించి

ఒక్క చేతిని అడ్డుపెట్టి వ్యాను నిలిపిన ధీర

నవతరంపు రెపరెపలకు రియా రియల్ మోడల్

మారో సార్ ...మారో.. మరో సారి.. మారో సార్ ’

రక్త సిక్త దేహంతోనే భరత్ బరియట్ గర్జన

చుట్టుముట్టిన పోలీసుల భయంకర దౌర్జన్యం

లాఠీ దెబ్బలు తింటూ కకావికలమై అరుపులు

భారతావనిలో శాంతియుత భరత్ పొలికేకలు

ఒకే ఒక్క ఆశయం జవాబుదారీ కావాలి

ఒకే ఒక్క లక్ష్యం తప్పుఒప్పుకొని తప్పుకోవాలి

అన్యాయంపై ఇన్‌స్టెంట్ కలయికలు

అల్గారిథమ్స్ అలలలో ఏకమైన 

మిలియన్స్ గళాలు

డిజిటల్ మెలకువలో వెలిగిన 

జంతర్ మంతర్

పడుసు పోరల ఉప్పొంగే ఉడుకు రక్త ప్రవాహం

మీడియా అంతా విస్తరించిన నిరసనల సిగ్నల్స్

సరే సరేనని ఊపే తలకాయలు కావు కదా

ప్రశ్నల మొలకల పోరాట పుష్పాల ఆశయాలు

నిండుగా ఏకమవుతున్న సమరశీల దృశ్యాలు

దిగివచ్చిన జవాబు సరికొత్త సూర్యోదయం

జజ్జనకరి జనారే... జన్ జీ.. జనరే !!