9 April, 2026 | 8:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలి

10-02-2026 12:59 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి9 (విజయక్రాంతి): మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీ సే పార్టీలకు ఇకపై బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రె స్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని మాది గ ఉపకులాలకు ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రేగుంట కేశవ్ రావ్ మాదిగ విజ్ఞ ప్తి చేశారు. సోమవారం అఖిల భారత మాలి సంక్షేమ సంఘం భవనంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగకూ అవకాశం ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో కూడా మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యా యమని ఆరోపించారు. మాదిగ వాడల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో చంద్రగిరి సుదర్శన్, పొన్నాల నారాయణ , చంద్రగిరి రవి ,పోల్కార్ రామచందర్, సురేష్ , కే.రాజు తదితరులు పాల్గొన్నారు.