2 May, 2026 | 2:23 AM

పదవ తరగతి ఫలితాలు గ్రామానికే గర్వకారణం

02-05-2026 01:48 AM

చందుర్తి, మే1 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఉన్నత మార్కులతో ఉత్తీర్ణులైన చందుర్తి మండలం లోని దేవుని తండా గ్రామ విద్యార్థిని, విద్యార్థులను గ్రామ సర్పంచ్ భూక్యా మోహన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా మోహన్ మాట్లాడుతూ‘పదవ తరగతి ఫలితాల్లో మన గ్రామ విద్యార్థులు మంచి మార్కులు సాధించడం చాలా గర్వకారణం.

విద్యార్థుల కష్టాని కి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి దక్కిన ఫలి తం ఇది, పదవ తరగతి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఇక్కడితో ఆగిపోకుండా ఉన్నత చదువుల్లో కూడా ఇదే స్ఫూ ర్తిని కొనసాగించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి మన గ్రామానికి, తలి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు,గ్రామ అభివృద్ధిలో విద్యా రంగానికి ఎప్పుడూ ప్రాముఖ్యత ఉంటుందని, విద్యార్థులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు,యువత పాల్గొన్నారు.