2 May, 2026 | 2:45 AM

మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోహర్

02-05-2026 01:46 AM

రాయికల్, మే 1 (విజయక్రాంతి): రాయికల్ మునిసిపల్ కమిషనర్గా టి. మనోహర్ శుక్రవారం రోజున పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్బంగా అధికారులు, సిబ్బంది ఆయనకు శుభా కాంక్షలు తెలియజేశారు.