ఫాల్కే ఫిలిం ఫెస్టివల్స్‌కు ది థర్డ్ ఎంపిక
సీనియర్ జర్నలిస్టు, రచయిత కేఏ మునిసురేశ్ పిళ్లె తొలిసారిగా కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫిలిం ‘ది థర్డ్’ (The 3rd) 16వ ‘దాదాసాహె బ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్-2026’లో స్క్రీనిం గ్‌కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జ యంతి సందర్భంగా ఏ టా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుం ది. ఈ ఏడాదికి సంబంధించి ఈ వేడుకలు కూ డా ఇదే నెల 30న జరగనున్నాయి.
ఈ చిత్రోత్సవానికి తెలుగులో సురేశ్ పిళ్లె రూపొందించిన ‘ది థర్డ్’ షార్ట్ ఫిలిం ఎంపికైంది. ఈ సందర్భంగా సురేశ్ పిళ్లె మాట్లాడుతూ.. “సృష్టిలో ఒక చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందని న్యూటన్స్ థర్డ్ లా చెబుతుంది. ‘మీరు కష్టపడి చదవకపోతే దానికి ప్రతిచర్యగా మీ జీవితాలు నాశనమైపోతాయి’ అంటూ.. ఫిజిక్స్ లెక్చరర్ పిల్లల్ని టార్చర్ పెడుతుంటాడు.
జీవితంలో ప్రతి విషయానికీ న్యూటన్స్ థర్డ్ లానే ఆపాదించి మాట్లాడుతుంటాడు. అలాంటి లెక్చ రర్ చేసిన పాపానికి, న్యూటన్స్ థర్డ్ లా చెప్పినట్టుగానే, ఎదురైన సమానమైన ప్రతి చర్య ఏమిటన్నదే ఈ సినిమా” అన్నారు.
ఈ లఘుచిత్రం కథేంంటే..?
కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులపై ఉండే ర్యాంకుల ఒత్తిడి, చదువులో వెనుకబడిన పిల్లలను లెక్చరర్లు వేధించే తీరును ఈ లఘుచిత్రం చూపిస్తుంది. ర్యాంకుల కోసం ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత, సదరు లెక్చరర్లలో కలిగే పరివర్తన చుట్టూ తిరిగే కథ ఇది. సుమారు 40 నిమిషాలు నిడివితో రూపొందిన షార్ట్‌ఫిల్మ్ ఇది.
ఆదర్శిని చిత్రాలు బ్యానర్‌పై భారతమ్మ నిర్మించిన ఈ లఘుచిత్రంలో ఆదర్శినిశ్రీ, ఒబ్బు ప్రసాద్, సీనియర్ జర్నలిస్టు, ప్రొఫెసర్ సూరావజ్ఝుల రాము, పెమ్మరాజు విజయరామచంద్ర, డాక్టర్ కిరణ్‌కుమార్, బాలమురళి వంటి పదిమంది నటులు ఇందులో తొలిసారిగా నటించారు. ఈ చిత్రానికి ఆదర్శిని భారతీకృష్ణ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఏఐ సహకారంతో స్వరపరిచిన రెండు పాటలకు సాహిత్యాన్ని ముని సురేశ్ పిళ్లె అందించారు.






