26 April, 2026 | 2:28 AM

ముచ్చటగా మూడోసారి!

26-04-2026 01:04 AM

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే విభిన్నమైన పాత్రలతో పేక్షకులను పలకరిస్తున్నా సరైన విజయాన్ని అందుకోలేకపోతోంది. అయినా వరుస అవకాశాలను అందిపుచ్చు కుంటూ కెరీర్‌లో ముందుకు దూ సుకుపోతోంది. ప్రస్తుతం ‘చాంద్ మేరా దిల్’ చిత్రీకరణతో బిజీగా ఉన్న అనన్య ఖాతాలో తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు చేరింది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న తాజా సినిమా ‘నాగ్జిల్లా’లో హీరోయిన్‌గా అనన్య పాండే ను ఎంపిక చేసినట్లు సమాచారం.

అయితే ఇప్పటికే వీరిద్దరూ కలిసి రెండు చితాల్లో నటిం చారు. కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడు మూడోసారి మళ్లీ కలిసి నటిస్తుండటంతో, ఈ జోడీపై ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా కేవలం రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాను వాస్తవానికి వచ్చే ఏడాది నాగుల పంచమి పండుగ సీజన్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేశారు.

కానీ, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండటంతో, ఐదు నెలల ముందే రిలీజ్‌కు రావాలని మేకర్స్ నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న వాలెంటైన్స్ డే కానుకగా ఈ చితాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫాంటసీ ప్రపంచంలో కార్తీక్ ఆర్యన్ యాక్షన్‌కు అనన్య గ్లామర్ తోడైతే కచ్చితంగా ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

ఈ సినిమాకు అమృద్దీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై మహావీర్ జైన్ ఫిలమ్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి సంగీతం బాధ్యతలు చూసుకుంటున్నారు. టీమ్ మొత్తం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి, ఈ సినిమాతోనైనా అనన్య తన ఖాతాలో విజయాన్ని వేసుకుంటుందన్న ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.