31 May, 2026 | 8:30 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

పారుపల్లి పెద్ద చెరువుకు పొంచివున్న ముప్పు

02-11-2025 04:59 PM

చిన్న తూముకు పడ్డ బుంగ... తెగిపోయే ప్రమాదంలో చెరువు..

అధికారులు స్పందించి తక్షణమే మరమత్తులు చేయాలి..

ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని పారుపల్లి పెద్ద చెరువుకు ప్రమాదం పొంచివుంది. చెరువు వద్ద ఉన్న చిన్న తూముకు బుంగ పడటంతో తెగిపోయే ప్రమాదంలో ఉంది. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే మరమత్తులు చేపట్టాలని పారుపల్లి మాజీ సర్పంచ్ చొప్పరి సరోజన సంపత్, ముత్తారం మాజీ సర్పంచ్ తూటీ రజీతరఫి కోరారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ చెరువుకు బుంగ పడిందని, దీంతో చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు ఆయకట్టు కింద దాదాపు వందల ఎకరాల పొలాలు ఉన్నాయని, మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోతారని, ఈ బుంగను తక్షణమే పూడ్చి వేయకపోతే పెద్ద ప్రమాదం తప్పదని వారు అధికారులకు సూచిస్తున్నారు. ప్రమాదం జరగకముందే చెరువుకు పడ్డ బుంగను పూడ్చి ఇటు రైతులను అటు మత్స్యకారులను ఆదుకోవాలని ప్రజలు, మాజీ సర్పంచ్ అధికారులను కోరారు.