calender_icon.png 2 November, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంపేటలో బాలింతకు పురుడు పోసిన 108 సిబ్బంది

02-11-2025 04:56:03 PM

తల్లి, బిడ్డ క్షేమం పెద్దపల్లి మాత శిశు ఆసుపత్రికి తరలింపు..

108 సిబ్బంది కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..

రామగిరి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన బాలింత గోవిందుల మౌనిక(28)కు పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108కి సమాచారం అందించారు. హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకోగానే మహిళకు పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్ చాకచక్యంగా వ్యవహరించి, వారి ఇంట్లోనే డెలివరీ నిర్వహించారు. 

అ ఆడపడుచు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం తల్లి, బిడ్డలను తదుపరి చికిత్స నిమిత్తం పెద్దపల్లిలోని మాత శిశు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలట్ మామిడి సంపత్ లకు మాతా శిశు ఆరోగ్య సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.