calender_icon.png 2 November, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం

02-11-2025 05:03:56 PM

కామారెడ్డి (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో రేవంత్ రెడ్డి బిజెపిపై, కేంద్ర మంత్రులపై, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని నిరసిస్తూ ఆదివారం కామారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు అవుతుందని ఉద్దేశంతో సైనికులపై, ఆపరేషన్ సిందూరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సైనికులను అవమానపరచడమేనని అన్నారు.

రాజకీయాల్లోకి సరిహద్దు వివాదాలను, సైనికులను తీసుకురావద్దని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీ ఏ ఒకటి నెరవేర్చలేదని అలాంటి కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అపసోపాలు పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైనికులకు, ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిజెపి, బీజేవైఎం నాయకులు రాజు పాటిల్, నరేందర్, డాక్టర్ వీరేశం, భూమేష్ యాదవ్, శ్రీనివాస్, రజనీకాంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.