27 June, 2026 | 2:48 PM

గొంతు తడిపే మిషన్ భగీరథ రైతులను గోస పెట్టింది

06-09-2025 12:19 AM
  1. రైతుల కడుపు కొట్టిన క్లోరిన్ 

మిషన్ భగీరథ క్లోరిన్‌తో మాడిపోయిన పత్తి, వరి పంటలు 

11మంది రైతులకు 30 ఎకరాల్లో పంట నష్టం 

మళ్లీ చిగురించినా తీరని నష్టం

గజ్వేల్ సెప్టెంబర్5: తాగునీటినీ శుద్ధిచేసి ప్రజల గొంతు తడపాల్సిన మిషన్ భగీరథ క్లోరిన్ వాయువు రైతులను గోసకు గురిచేసింది. రెండు నిమిషాల్లో 30 ఎకరాల పంటను మాడగొట్టింది. కుకునూరుపల్లి మండలం మంగోల్ లో తెలంగాణ ప్ర భుత్వం నిర్వహిస్తున్న మిషన్ భగీరథ వాట ర్ ప్లాంట్ లో ప్రతిరోజు తాగునీటిని శుద్ధి చేయడానికి క్లోరినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

క్లోరినేషన్ చేయడానికి సిలిండర్ ఖాళీ కావడంతో కొత్త సిలిండర్ బిగిస్తున్న క్రమంలో రెండు నిమిషాల పాటు క్లోరిన్ వాయు లీకేజీ అయ్యింది. క్లోరిన్ వాయువు భారంగా ఉండడంతో మంగోల్ గ్రామ రె వెన్యూ పరిధిలోని 30 ఎకరాలలో పత్తి, వరి పంటలపై పడిపోవడంతో పూర్తిగా మాడిపోయింది. అదృష్టవశాత్తు వాటర్ ప్లాంట్ నుండి క్లోరిన్ గ్యాస్ లీకేజీ సమయంలో జ న సంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రా ణ నష్టం జరగలేదు.

ఈ సంఘటన గడిచి ఐదురోజుల కాగా మాడిపోయిన పంటలో కొత్తగా ఆకులు చిగురిస్తున్నాయి. అయినా 90 రోజుల పంట కాలం పూర్తి కాగా, ఇ ప్పుడు మళ్లీ ఆకులు చిగురించినా లాభం ఉండదని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటనలో మంగోలు, మాత్ పల్లి, మేదినీపూర్ గ్రామాల 11 మంది రైతులకు చెందిన 5 ఎకరాల పత్తి, 25 ఎకరాల వరి పంటలు మాడిపోయాయి.

బుధవారం కలెక్టర్ హైమావతి సంఘటనా స్థలాన్ని సం దర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని, పంట నష్టాన్ని లెక్కించి వివరాలు పంపాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులను ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి స్వ రూపారాణి, ఏడీఏ బాబు నాయక్, ఏఓ గో విందరాజులు పంట నష్టాన్ని లెక్కించి నివేదికను కలెక్టర్ కు అందజేశారు. 

అడియాసలైన రైతుల ఆశలు

పంటలు బాగా పండుతున్నాయని, మంచి లాభం వస్తుందని ఆ మూడు గ్రా మాలు రైతులు పెంచుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గతంలో కన్నా ఈసారి తాము పండిస్తున్న పత్తి, వరి పంటలు రేపు గా ఎదుగుతున్నాయని మంగోల్, మేదినీపూర్, మాత్ పల్లి గ్రామాలకు చెందిన 11 మంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి పంట నష్టపరిహారాన్ని అందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి

కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామ శివారులో నిర్మించినటువంటి మిష న్ భగీరథ వాటర్ ప్లాంట్ నుండి లీక్ అయి న క్లోరైడ్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరా కు 50వేల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవా రం సిపిఎం పార్టీ బృందం కుకునూరుపల్లి మండలం మేదిని పూర్ గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ సాగు చేస్తు న్న ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు మిషన్ భ గీరథ వాటర్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యంతోనే నష్టం జరిగిందన్నారు. అధికారులు కాలయాపన చేయకుండా పంట నష్టాన్ని త్వరగా లెక్కించి అందజేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య, మండల కమిటీ సభ్యులు రవీంద్ర చారి, అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.