06-09-2025 12:21:04 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్
గజ్వేల్, సెప్టెంబర్ 5: పేద మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గించాలనే హృదయపూర్వక ఉద్దేశ్యంతో మోడీ జీఎస్టీ తగ్గించారని బిజెపి జిల్లా అధ్యక్షుడు డైరీ శంకర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ లు అన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలు వినియోగించే వస్తువులపై జిఎస్టి తగ్గించినందుకు బిజెపి గజ్వేల్ పట్ట ణ, మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ దసరా, బతుకమ్మ, దీపావళి పం డుగల ముందు తీసుకున్న ఈ నిర్ణయం ని జంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. పేద, మధ్యతరగతి వర్గానికి ఇది మోడీ ఇచ్చిన గొప్ప బహుమానమని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న తాజా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించిందన్నార.
దినసరి అవసరాలు, గృహ వినియోగ వస్తువులపై పన్ను లు తగ్గడంతో వినియోగదారులకు నేరుగా లాభం చేకూరనుందన్నారు. ఈ నిర్ణయా న్ని ప్రజలు పండుగ కానుకగా భావిస్తున్నట్లు తెలిపారు. వంటింటి ఖర్చులు తగ్గడంతో పండుగ సీజన్లో కుటుంబాలపై ఆర్థి క భారాన్ని తగ్గిస్తుందని మహిళలు అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. జీఎస్టీ తగ్గింపుతో రూ. 40,000 కోట్ల ఆదాయం కో ల్పోతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు.
ప్రజల జీవితాలను సులభతరం చేయడమే లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. వైద్య రంగం, ఇన్సూరెన్స్ రంగాలలో కూడా జీఎ స్టీ తగ్గింపు అమలులోకి వచ్చిందని, ఆసుపత్రి సేవలు, వైద్య పరికరాలు, ఆరోగ్య బీ మా పాలసీలపై పన్ను తగ్గడం వల్ల సాధారణ ప్రజలకు చౌకగా ఆరోగ్య సేవలు అం దుబాటులోకి రానున్నాయన్నారు. ఇప్పటి వరకు అధిక ప్రీమియం కారణంగా ఇన్సూరెన్స్ దూరంగా ఉంచిన మధ్యతరగతి కు టుంబాలు ఇకపై తక్కువ ధరల్లో బీమా పొందే వీరు కలిగిందన్నారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుందన్నారు.
ఈ కా ర్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు యేల్లు రాంరెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యు లు సింగం సత్తయ్య, బిజెపి సీనియర్ నా యకులు మాజీ సర్పంచ్ నత్తి మల్లేశం గజ్వే ల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్, గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్ బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు చేప్యాల వెంకట్ రెడ్డి, ఎలకంటి సురేష్, మాజీ కౌన్సిలర్ రాంచంద్రా చారి, బుద్ద మహేందర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శులు నాయి ని సందీప్ కుమార్ మరియు మడుగూరి నరసింహ ముదిరాజ్, గజ్వేల్ రూరల్ మం డల్ ప్రధాన కార్యదర్శులు బారు అరవింద్,
ఇప్ప స్వామి, నాయకులు గజ్వేల్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షురాలు చెన్నోజి నీరజ, అ యిల మహేందర్, కాశమైన సందీప్ కు మార్, తలారి రాజు,గోపాల్ యాదవ్, కోటే స్వామి, నిరంజన్ రెడ్డి, గజ్వేల్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు సిల్వేరు కుంకుమ రాణి, సందిరి రాజు, గడియారం రాజేశ్వర్ చారి,అభి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.