పంట తరలింపును వేగవంతం చేయాలి
ఇచ్చోడ మార్కెట్ యార్డ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్, మే 26 (విజయక్రాంతి) : జొన్నల కొనుగోళ్లతో పాటు, తూకం వేసిన పంటను గోదాం లకు తరలించే రవాణా ప్రకియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలో ని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ను ఆ యన ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మార్కెట్కు వస్తున్న పంట దిగుబడులు, ప్ర స్తుత కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సేవలపై అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
యార్డ్లో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని స్వయంగా అడిగి తె లుసుకున్న కలెక్టర్, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశా రు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మార్కెట్ యార్డ్కు పంటను తీసుకువచ్చే రైతులకు తాగునీరు, సేదతీరడానికి నీడ వంటి కనీస మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. పంట కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, తూకాల్లో ఎలాంటి వ్యత్యాసాలు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే, కొనుగోలు చేసిన పంటను సకాలంలో గిడ్డంగులకు తరలించేలా రవాణా చర్యలు వేగవంతం చేయాలని, రైతులకు చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో మండల ప్రత్యేక అధికారి రామారావు, తహసీల్దార్ ఇమ్రాన్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ జె.జాకు, మార్కెట్, రెవెన్యూ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






