31 July, 2026 | 8:20 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

ముగ్గురు వ్యాపారులపై కేసు

27-05-2026 12:34 AM

ఉట్నూర్, మే 26( విజయ క్రాంతి ): ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ముగ్గురు వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు జొన్న పంటలు కొనుగోలు చేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న కొనుగోలు కేంద్రంలో పంటలు విక్రయించుటకు సిద్ధంగా ఉన్న ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు. మంగళవారం ‘ ఇతర రాష్ట్రాల పంట.. ఇక్కడ విక్రయం ‘ అనే శీర్షికతో  విజయ క్రాంతి దినపత్రికలో కథనం ప్రచురణాయింది. కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్శి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జొన్నలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంద్రవెల్లి ఎస్‌ఐ సాయన్న మార్కెట్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసిన టకాడ నానాక్ రామ్, కాచికాడ్ నత్తు సింగ్, మన్నే యోగేష్ లను గుర్తించి వారి వద్ద రైతులకు చెందిన వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టేదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీలను స్వాధీనపరచుకున్నట్లు ఎస్త్స్ర తెలిపారు. రైతుల  రైతుల వద్ద జొన్నలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించే వ్యాపారులపై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశామని ఎస్‌ఐ అన్నారు. రైతులను మోసేగించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువచ్చిన జొన్నలపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు.