08-02-2026 12:48:58 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : రాజీవ్ స్వగృ హ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లు ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాయి. ఓపెన్ పాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలో తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు భారీగా పాల్గొన్నారు.
తొలి రోజు 70ప్లాట్ల విక్రయం
బాటసింగారం ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ వేలం పాట తొలిరోజున శనివారం నాడు 70 ప్లాట్లను విక్రయించారు. ఈ ప్రాంతంలోని భూములను గరిష్టంగా చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు చేశారు. తొర్రూర్‌తో పాటు ఓఆర్‌ఆర్‌కు సమీపంలోని బహదూర్‌పల్లి, కుర్మల్ గూడ ప్రాం తాల్లోని ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి రాజీవ్ స్వగహ కార్పొరేషన్ గత నెలలో నోటి ఫికేషన్ విడుదల చేసింది.
శనివారం నాడు విక్రయించిన భూముల ద్వారా సుమారు రూ.56కోట్ల మేర ఆదాయం వచ్చిందని మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. తొర్రూ ర్‌లోని ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేయడానికి దాదాపు 150 మంది ముందుకు వచ్చారు. వీరిలో అనేక మంది కుటుంబ సమేతంగా వచ్చి, తమకు నచ్చిన ప్లాట్‌ను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. ఒక కార్నర్ ప్లాట్‌ను దక్కించుకోడానికి వేలం పాటలో 20సార్లకు పైగా ధరలు పెంచుతూ పోటీ పడటమే ఇక్కడి ప్లాట్లకు ఉన్న డిమాండ్‌కు నిదర్శనం.
200 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల చదరపు గజం కనీస ధర (అప్ సెట్ ప్రైజ్) రూ.25వేలుగా నిర్ణయించారు. కొన్నిప్లాట్లను రూ.45 వేలు, 43వేలు, 41 వేలకూ కొనుగోలు చేశారు. మొత్తం మీద ఇక్కడ వేలం వేసిన భూములు సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడుపోయాయి.
రాజీవ్ స్వగహ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జి. వి.రమణా రెడ్డి, ఈఈ నరేందర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేలంపాట నిర్వహించారు. తొర్రూర్‌లే అవుట్‌లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
పోచారం, బండ్లగూడల్లో 71 ప్లాట్ల కేటాయింపు
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ నాగోలు, పో చారం ప్రాంతాల్లో నిర్మించిన గ్రేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకించిన వాటిలో 71 ప్లాట్లను లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బండ్లగూడలోని 15 ప్ల్లాట్లు, పోచారంలో 56 ప్ల్లాట్ల లాటరీ తీయడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు రూ.11 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.