ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా విశ్వశాంతి మహాయాగం
కల్వకుర్తి, జూలై 22: ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా కల్వకుర్తి పట్టణంలో నిర్వహి స్తున్న 91వ విశ్వశాంతి మహాయాగం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం లక్ష్మీ గణపతి హోమం, అఘోర పాశుపత రుద్ర హోమం, అమృత మృత్యుంజయ హోమం, చంద్రగ్రహ హో మం నిర్వహించారు. సుమారు 500 మంది ఋత్వికులు హోమాల్లో పాల్గొని విశ్వశాంతి కోసం వేద మంత్రోచ్ఛారణలతో యాగాన్ని నిర్వహించారు.
మహాయాగం కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. యాగశాలలో హనుమాన్ చా లీసా పారాయణం, భగవద్గీత పారాయణం, భజనలు వివిధ భక్త బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సాయం త్రం అష్టలక్ష్మి వి శేష పూజలు, జ్యోతిర్లింగార్చన, ద్వాదశ జ్యో తిర్లింగార్చన, అభిషేకాలు, అర్చనలు, కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రతిరోజూ సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాగ నిర్వాహకులు జూలూరు రమేష్ బాబు, బిచని బాలకృష్ణ, పోల సురేందర్, మదన మురళి, జంగయ్య గౌడు, ప్రకాష్, పెద్దయ్య గౌడు, కల్మచర్ల గోపాల్, బాదం రాఘవేందర్ తదితరులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






