15 April, 2026 | 1:38 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం సరైనదే

17-06-2025 01:07 AM

- జీతు7 సదస్సులో సభ్య దేశాల తీర్మానం

- ఇరాన్ ఎన్నటికీ యుద్ధం గెలవదు: ట్రంప్

కనాన్‌స్కిస్, జూన్ 16: ఇరాన్‌లోని అణు శుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం సరైనదేనని జీ సభ్య దేశాలు సోమవారం తీర్మానం చేశాయి. అణు నిర్మూలనలో భాగంగా ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటానికి అన్ని దేశాలు మద్దతుగా నిలవాల్సిన అవసరముందని పేర్కొన్నాయి.

కెనడాలోని కనాన్‌స్కిస్ వేదికగా జీథు|7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ గెలవదని ట్రంప్ పేర్కొన్నారు. ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్‌తో చర్చలకు వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. కెనడాలోని కనాన్‌స్కిస్ వేదికగా జరుగుతున్న జీ సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశాల్లో ఇజ్రాయెల్, ఇరాన్‌కు సంబంధించిన ముసాయిదా బిల్లుపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించినట్టు తెలుస్తోంది. అమెరికా ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదని.. ఇప్పటికైనా అణ్వాయుధ ఒప్పందానికి ఇరాన్ ముందుకు వస్తే యుద్ధం తక్షణమే ఆగిపోతుందని ట్రంప్ మరోసారి తేల్చిచెప్పారు.

అంతకుముందు తన సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు. కేవలం తన వల్లనే నెల రోజుల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్నారు. తాజాగా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ దాడులతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని, అయినా లెక్క చేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే కనీవినీ ఎరుగని రీతిలో టెహ్రాన్‌పై విరుచుకు పడతామని హెచ్చరించారు.