25 June, 2026 | 3:02 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

25-06-2026 01:56 AM

ఎమ్మెల్యే మందుల సామెల్

ఆలేరు, జూన్ 24 : రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. అడ్డగూడూర్ మండలం రేపాక గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం భూములిచ్చిన 10 మంది రైతులకు బుధవారం కలెక్టరేట్లో ఎకరానికి రూ.12 లక్షల చొప్పున పరిహారం చెక్కులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో నిర్ణయించిన రూ.6 లక్షలకు బదులు తాను కలెక్టర్తో చర్చించి మరో రూ.6 లక్షలు కలిపి ఇప్పించానన్నారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ శేషగిరిరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.