25 March, 2026 | 1:50 AM

గంగలో కలిసిన దివ్యాంగుల సంక్షేమం

25-03-2026 12:06 AM
  1. పెన్షన్ కూడా సమయానికి అందడం లేదు 

శాసనసభలో వారి సమస్యలను ప్రస్తావిస్తాం

బీఆర్‌ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్

నేడు ఇందిరాపార్క్ వద్ద దివ్యాంగుల నిరసన దీక్ష

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాం గుల సంక్షేమం గంగలో కలిసిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గా ల ప్రజలు ఇబ్బందుల గురవుతున్నారని, దివ్యాంగులు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. దివ్యాంగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు.

మంగళవారం అసెంబ్లీ బయట కేటీఆర్‌ను దివ్యాం గుల కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. బుధవారం ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల నిరసన దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో దివ్యాంగుల సంక్షేమ కోసం ఎంతో కృషి చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని, వారికి నెలనెల వచ్చే పెన్షన్ కూడా సరైన సమయానికి అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని స్పష్టంచేశారు. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తా మని తెలిపారు. బుధవారం దివ్యాంగులు చేపట్టే నిరసన దీక్షకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, దివ్యాంగుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందని వెల్లడించారు.